India test match: ప్రస్తుత భారత్ స్కోరు 59/2... 7 d ago
బాక్సింగ్ డే టెస్టులో భారత జట్టు కష్టాల్లో పడేలా ఉంది. రెండో రోజు టీ బ్రేక్ సమయానికి టీమిండియా 2 వికెట్ల నష్టానికి 51 పరుగులు చేసింది. ఓపెనర్ గా వచ్చిన కెప్టెన్ రోహిత్ (3) మరోసారి విఫలం కావడం అభిమానులను నిరాశపరిచింది. వన్ డౌన్ లో వచ్చిన కేఎల్ రాహుల్ (24) కుదురుకున్నట్లు కనిపించినా.. పాట్ కమిన్స్ స్వింగ్ బంతికి క్లీన్ బౌల్డయ్యాడు. టీమ్ ఇండియా ఇంకా 415 పరుగులు వెనకబడి ఉంది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ లో 474 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.